జాన్వీ పెళ్లికి ముందేం పుట్టలేదు: బోనీ

- Advertisement -
Janhvi Kapoor

అలనాటి అందాల తార శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ల వివాహం గురించి ఎన్నో పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఒకటి.. ఈ జంటకు పెళ్లికి ముందే జాన్వీకపూర్ పుట్టిందట. అయితే ఈ ప్రచారానికి తాజాగా బోనీ కపూర్ ఫుల్ స్టాప్ పెట్టారు.

షిర్డీలో 1996లో శ్రీదేవిని రహస్య వివాహం చేసుకున్నట్టు బోనీ కపూర్ వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు తమ వివాహ బంధాన్ని రివీల్ చేశామని తెలిపారు.

ఇక అందరికీ తెలిశాక పబ్లిక్‌గా 1997 జనవరిలో శ్రీదేవిని మరోసారి వివాహం చేసుకున్నారట. అయితే 1997 మార్చిలో తమకు జాన్వీ జన్మించడంతో పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతి అయ్యిందంటూ ప్రచారం జరిగిందని చెప్పుకొచ్చారు. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని.. అయితే తమకు 1996లోనే వివాహమైన సంగతి బయటి ప్రపంచానికి తెలియక పోవడంతో అలాంటి రూమర్ పుట్టుకొచ్చిందని బోనీ కపూర్ వెల్లడించారు.

ఇంకా బోనీకపూర్ శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. ఆమెకు దేవుడంటే అమితమైన భక్తి అని.. ప్రతి పుట్టినరోజుకు తిరుమల వెళుతూ ఉండేవారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జాన్వీ కూడా ప్రతి మూడు నెలలకొకసారి తిరుమల వెళుతుంటుందని వెల్లడించారు.

ఇక శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర కోణమూ లేదని మరోసారి బోనీ తెలిపారు. నిజానికి ఆమె తన అందం కాపాడుకోవడం కోసం ఉప్పు లేని ఆహారాన్ని తీసుకునే వారట. కొన్నిసార్లు బీపీ డౌన్ అయిపోయి పడిపోవడం కూడా జరిగిందని బోనీ వెల్లడించారు. అలా ఆమె బాత్ టబ్ లో పడిపోయి మరణించి ఉంటారు అన్నట్లుగా చెప్పారు.

 

More

Related Stories