ఆ టైటిల్ ఫిక్స్ చేసిన బోయపాటి?

BB3

నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త సినిమా టైటిల్ ని ఇంకా ప్రకటించలేదు. ఎన్టీఆర్ జయంతి స్పెషల్ గా మే 28న సినిమా విడుదల అవుతుంది అని అనౌన్స్ చేశారు. అలాగే, ఒక చిన్న డైలాగ్ టీజర్ కూడా ఇప్పటికే బయటికి వచ్చింది. కానీ అసలైన టైటిల్ మాత్రం ఇంకా చెప్పలేదు.

దాంతో ఈ సినిమా పేరు గురించి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఐతే, అనేక పేర్లు పరిశీలించి మొదట అనుకున్న “మోనార్క్” అనే పేరునే బోయపాటి ఫిక్స్ చేసినట్లు టాక్. మొదట ఈ టైటిల్ నెగెటివ్ అవుతుంది అని డౌట్ పడ్డారు. ఐతే, ఇంతకన్నా బెస్ట్ ఆప్సన్ దొరకట్లేదు అని దీనికే ఒకే చెప్పారని ఇండస్ట్రీ మాట.

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలయ్యది ద్విపాత్రాభినయం. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

More

Related Stories