బోయపాటికి డేట్స్ ఇచ్చేది ఎవరు?

Boyapati Srinu

బోయపాటి శ్రీను అగ్ర దర్శకుల్లో ఒకరు. కానీ ఆయనతో సినిమాలు చెయ్యాలంటే చాలామంది హీరోలు ఎన్నో ఆలోచనలు చేస్తారు. ఆయన తీసే సినిమాలు అందరి హీరోలకు సూట్ అవ్వవు. ముఖ్యంగా బాలయ్యతో తప్ప మిగతా హీరోలతో ఆయన ట్రాక్ రికార్డ్ బాలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఆయనకి కొంత సింక్ కుదిరింది.

ఇటీవల రామ్ పోతినేని ధైర్యం చేసి బోయపాటి డైరెక్షన్లో నటించాడు. సినిమా ఫ్లాప్ కావడమే కాదు రామ్ చాలా ట్రోలింగ్ ఎదురుకోవాల్సి వచ్చింది. అందుకే, బోయపాటి తన తదుపరి హీరో విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తున్నాడు.

అల్లు అర్జున్ తో నెక్స్ట్ సినిమా చెయ్యాలనేది బోయపాటి ప్లాన్. “పుష్ప” సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ వచ్చింది కాబట్టి తన తదుపరి చిత్రం విషయంలో అల్లు అర్జున్ కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చెయ్యాలి. అందులో మార్పు లేదు. ఆ సినిమా తర్వాతో, ముందో బోయపాటితో చెయ్యాలా అనేది అల్లు అర్జున్ ఇంకా నిర్ణయించుకోలేక పోతున్నాడు.

ఒకవేళ బన్నీ చెయ్యకపోతే ఏమి చెయ్యాలి అనే విషయంలో బోయపాటికి క్లారిటీ లేదు. బాలయ్య ఎప్పుడు అడిగినా అవకాశం ఇస్తారు కానీ బాలయ్య తప్ప బోయపాటికి ఇంకో హీరో డేట్ ఇవ్వడు అన్న ముద్ర పడుతుంది. అది బోయపాటి భయం.

Advertisement
 

More

Related Stories