బోయపాటికి ఇంకో సినిమా కన్ఫర్మ్!

Boyapati Srinu

బోయపాటి ప్రస్తుతం బాలయ్యని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా కారణంగా ఆగింది. నవంబర్లోనో, డిసెంబర్లోనో మళ్ళీ షూటింగ్ షురూ చేస్తుంది. ఏప్రిల్ 2021లో విడుదల చెయ్యాలనేది ప్లాన్. ఒకప్పుడు బోయపాటి వెంట నిర్మాతలు పడేవారు. ఐతే, “జయ జానకి నాయకా”, “వినయ విధేయ రామ” వంటి చిత్రాలు బోయపాటి రేంజ్ పడిపోయేలా చేశాయి.

దాంతో, బాలయ్య సినిమాకి నిర్మాత దొరకడం కష్టం అయింది. నిర్మాత కూడా బడ్జెట్ తగ్గించమని పట్టు పట్టాడు. ఇలాంటి టైములో అప్పుడే అతని నెక్స్ట్ సినిమా తమ బ్యానర్లో తీయమని దిల్ రాజు ఒప్పించాడని వార్తలు వస్తున్నాయి. ఇది కొంచెం విచిత్రమే. కానీ దిల్ రాజుకి కూడా “పెద్ద” దర్శకులు తన బ్యానర్లో నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అడిగాడని అంటున్నారు.

చూడాలి, ఈ సినిమా నిజంగా వర్కౌట్ అవుతుందా అనేది.

అన్నట్లు బోయపాటి మొదటి సినిమా (భద్ర) దిల్ రాజు బ్యానర్లోనే వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సెట్ అవుతోందన్నమాట.

Related Stories