బన్నీ బిజీ…రామ్ ఓకే

- Advertisement -
Ram Pothineni

మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి. హీరో ఎవరైనా అతడి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ మస్ట్. ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న “అఖండ” సినిమా కూడా ఊర మాస్ సినిమా. టీజర్ చూస్తేనే ఆ విషయం అర్థమౌతుంది. ఈ టీజర్ నచ్చే మరో సినిమా చేసేందుకు బోయపాటికి ఆఫర్ ఇచ్చాడు బన్నీ. కానీ ఇప్పట్లో ఈ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు.

“అఖండ” తర్వాత అల్లు అర్జున్ హీరోగా బోయపాటి సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బన్నీ ఫుల్ బిజీ. పుష్ప పార్ట్-1, పార్ట్-2 కంప్లీట్ చేయాలి. వేణుశ్రీరామ్ తో “ఐకాన్” సినిమా ఉండనే ఉంది. మధ్యలో మరోసారి త్రివిక్రమ్ లైన్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇటు బోయపాటి మాత్రం బన్నీ కోసం వెయిట్ చేసే పరిస్థితిలో లేడు. ఎందుకంటే వినయ విధేయ రామ ఎఫెక్ట్ కావొచ్చు, కరోనా ప్రభావం కావొచ్చు.. బోయపాటి కెరీర్ లో గ్యాప్ బాగా వచ్చేసింది. అందుకే బన్నీ కోసం ఎదురుచూడకుండా హీరో రామ్ కు కథ చెప్పడం, ఆయనతో సినిమా ఓకే చేయించుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత రూటు మార్చిన రామ్… మాస్ కథలు, యాక్షన్ మూవీస్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి స్టోరీలైన్ కు ఓకే చెప్పాడు. అఖండ తర్వాత బోయపాటి-రామ్ కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు.

More

Related Stories