
“భద్ర”, “తులసి”, “సింహ”, “లెజెండ్”, “సరైనోడు”, “అఖండ” వంటి భారీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుకి మాస్ లో ఇమేజ్, క్రేజ్ మామూలుగా లేదు. ఐతే, ఆయన ఎక్కువగా బాలయ్యతోనే భారీ హిట్స్ ఇచ్చారు. ఇతర హీరోలతో ఆయన సినెమాలు అంతగా వర్కవుట్ కావు అనే ఒక అపవాదు ఉంది.
దాన్ని బద్దలు కొట్టి నిరూపించుకోవాలి. అది “స్కంద”తో బోయపాటి చూపిస్తారని ట్రేడ్ బలంగా నమ్ముతోంది. ఇప్పటికే ఈ సినిమాకి థియేట్రికల్ వ్యాపారం అదిరిపోయింది. ఇక ఓటిటి, శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలు లాభాల్లో ఉన్నారు. రిలీజ్ కు ముందే దాదాపు 90 కోట్ల వ్యాపారం జరిగింది. ఇది బోయపాటి రేంజ్.
ఇక రామ్ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి లేదు. మాస్ సినిమాలతో కూడా భారీ హిట్స్ అందించాడు రామ్. బోయపాటితో ఇంకో మెట్టు ఎక్కడమే మిగిలి ఉంది.
ఈ 28న విడుదల కానుంది “స్కంద”. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా కూడా “అఖండ”లా భారీ హిట్ ఐతే బోయపాటి నిజమైన రేంజ్ ఏంటో అందరికీ అర్థమవుతుంది.