బోయపాటికి ఎన్నికలే టార్గెట్

Boyapati Srinu

దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ హీరోగా ఒక చిత్రం తీస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. అంటే, షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ సినిమా దసరాకి విడుదల అవుతుంది. కానీ, ముందే అన్ని పనులు పూర్తి చేసుకొని మరో సినిమా మొదలు పెడతారట.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో కొత్త సినిమా మొదలు కానుంది. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు విడుదల చెయ్యాలనేది ప్లాన్. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగులు గట్టిగా ఉంటాయట. ఏపీలోని ప్రస్తుత రాజకీయా పరిస్థితులు ఆధారంగా కథ అల్లుతున్నారు.

బాలకృష్ణ, బోయపాటి కొత్త సినిమా ప్రకటన వచ్చే నెల జూన్ 10న ఉంటుంది. ఆ రోజు బాలయ్య బర్త్ డే. ఎన్నికలే టార్గెట్ గా వీరి కొత్త సినిమా స్పీడ్ గా జరగనుంది.

బాలయ్య కూడా ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రంలో నటిస్తున్నారు. అది ఆగస్టుకి పూర్తి అవుతుంది. సో బాలయ్య, బోయపాటి సినిమా సెప్టెంబర్, అక్టోబర్ లో మొదలయి 2024 మార్చిలో విడుదల అవుతుంది.

 

More

Related Stories