‘బ్రహ్మాస్త్ర’ని టార్గెట్ చేసిన ఆ గ్యాంగ్

బాలీవుడ్ లో బాయ్ కాట్ గ్యాంగ్ హవా నడుస్తోంది. ఏదైనా సినిమా విడుదలైతే చాలు, ఆ సినిమాలో నటించిన హీరోనే, నిర్మాతనో, దర్శకుడో, హీరోయినో ‘యాంటీ నేషనల్’ అని డిక్లెర్ చెయ్యడం, ఆ సినిమాని బాయ్ కాట్ చెయ్యాలని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడపడం ఇప్పుడు ఒక అలవాటుగా మారింది ఈ గ్యాంగ్ కి.

ఈ నెలలోనే ‘లాల్ సింగ్ చద్దా’, ‘లైగర్’ చిత్రాలకు చుక్కలు చూపించింది ఈ గ్యాంగ్. ఇప్పుడు ఆ గ్యాంగ్ చూపు ‘బ్రహ్మస్త్ర’పై పడింది. ఆల్రెడీ ట్విట్టర్లో ట్రేండింగ్ మొదలుపెట్టారు.

అలియా భట్, రణబీర్ కపూర్, నాగార్జున తదితరులు నటించిన ఈ చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాత. రాజమౌళి ప్రెజంటర్ గా ఉన్నారు. కానీ, అలియా భట్, రణబీర్ కపూర్, కరణ్ లని టార్గెట్ చేసి ఈ సినిమాపై నెగెటివ్ ట్రెండింగ్ మొదలు పెట్టారు. ఈ గ్యాంగ్ కి దగ్గర కావాలనే కరణ్ జోహార్ ఈ థీమ్ తో సినిమాని నిర్మించారు. రాజమౌళిని, విజయేంద్ర ప్రసాద్ లను కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. అయినా, ఆ గ్యాంగ్ తమ పంథా వీడట్లేదు.

సెప్టెంబర్ 9న విడుదల కానుంది ‘బ్రహ్మాస్త్ర’. సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో భారీ ఎత్తున ఒక ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ దీనికి ముఖ్య అతిథి. మరి ఈ సినిమానైనా స్మూత్ గా విదులయ్యేలా చూస్తుందా బాయికాట్ గ్యాంగ్ అనేది చూడాలి.

 

More

Related Stories