బ్రహ్మన్నగా బ్రహ్మాజీ

కామెడీ, క్యారెక్టర్, నెగెటివ్… ఇలా ఏ పాత్రలోనైనా, ఈ జోనర్లనైనా అవలీలగా ఒదిగిపోయే నటుడు బ్రహ్మాజీ. ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్న ఆర్టిస్టులలో ఒకరు బ్రహ్మాజీ. ఆయన ఒక కొత్త సినిమాలో బ్రహ్మన్నగా కనిపించనున్నారు.

ఈ సినిమా పేరు కూడా వెరైటీగా, ట్రెండీగా ఉంది. ‘లైక్, షేర్, సబ్ స్క్రైబ్’ అనేది ఈ చిత్రం పేరు. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. మేర్లపాక గాంధీ తీస్తున్న ఈ కామెడీ చిత్రంలో బ్రహ్మన్న పాత్రలో కనిపించనున్నారు బ్రహ్మాజీ.

బ్రహ్మన్న మొదటి లుక్ విడుదలైంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ‘శ్యామ్ సింగ రాయ్’ నిర్మించిన వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని తీస్తున్నారు.

 

More

Related Stories