నటుడు బ్రహ్మాజీకి కరోనా

Brahmaji

టాలీవుడ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి సారి కన్నా రెండోసారి కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. రీసెంట్ గా అల్లు అరవింద్, త్రివిక్రమ్, నివేధా థామస్ వంటి సెలెబ్రిటీలు కరోనా నుంచి కోలుకున్నారు.

లేటెస్ట్ గా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కూడా కరోనా వ్యాధికి గురయ్యారు. ఆయన ఒక పెద్ద సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా రెగ్యులర్ చెక్ అప్ లో కరోనా అని తేలింది.

దాంతో ఆ పెద్ద సినిమాకి చెందిన యూనిట్ సభ్యులు, హీరో, హీరోయిన్ ఐసోలేషన్ కి వెళ్లారని తెలుగుసినిమా.కామ్ కి తెలిసింది. బ్రహ్మాజీ ప్రస్తుతం ఇంటివద్దే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

More

Related Stories