కర్ణాటక ఎన్నికల్లో బ్రహ్మి

Brahmanandam


హాస్యబ్రహ్మగా పేరొందిన బ్రహ్మానందం రాజకీయాలకు దూరంగా ఉంటారు. అందరివాడు అనిపించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు సడెన్ గా ఒక రాజకీయపార్టీకి ప్రచారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈనెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి గడువు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సినిమా తారలను రంగంలోకి దింపాయి. బీజేపీకి చెందిన ఓ అభ్యర్థి ఏకంగా బ్రహ్మానందాన్ని తన తరఫున ప్రచారానికి రప్పించారు. గురువారం బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చెయ్యడం విశేషం.

చిక్కబళ్లాపుర అనే నియోజకవర్గంలో ఆయన బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ తరపున ప్రచారం చేశారు. సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంతకుముందు కూడా ఇదే నియోజకవర్గంలో బ్రహ్మి ప్రచారం చేశారట. మళ్ళీ ఇప్పుడు సుధాకర్ ని గెలిపించాలని ప్రజలను కోరారు బ్రహ్మానందం. వీరిద్దరి మధ్య స్నేహబంధం ఉందట.

ప్రచారంలో భాగంగా “ఏయ్ శాల్తీలు లేచిపోతాయి” అని “మనీ” సినిమాలోని తన డైలాగులు చెప్పి ఓటర్లను ఆకట్టుకున్నారు బ్రహ్మి.

Advertisement
 

More

Related Stories