
బాలీవుడ్ కి కష్టకాలం ఇది. విడుదలైన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతోంది. గంపెడు ఆశలు పెట్టుకున్న ‘బ్రహ్మాస్త్ర’కి కూడా మిశ్రమ స్పందన ఉంది. దాంతో, బాలీవుడ్ ఇప్పట్లో కోలుకునేలా లేదని భావించిన షేర్ మార్కెట్ తీవ్రంగా స్పందించింది.
దేశంలో వందలకొద్దీ సినిమా స్క్రీన్లను నడుపుతున్న మల్టీప్లెక్సు కంపెనీల షేర్ల శుక్రవారం పడిపోయాయి. పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు భారీగా క్షీణించాయి.
పీవీఆర్ షేరు విలువ 5 శాతం, ఐనాక్స్ షేరు 4.86 శాతం మేర క్షీణించాయి. మరోవైపు పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ సంస్థలు నష్టాలు తగ్గించుకునేందుకు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఐతే, టాక్ ఎలా ఉన్నా ‘బ్రహ్మాస్త్ర’కి భారీ ఓపెనింగ్ వచ్చింది. మొదటి రోజు ఈ సినిమా 35 కోట్లపైనే కలెక్ట్ చేసేలా ఉంది. ఏపీ, తెలంగాణాలో కూడా రికార్డు కలెక్షన్లు పొందింది. ‘ధూమ్ 3’ సినిమా రికార్డుని చెరిపేసింది.
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా మొదటి వీకెండ్ తర్వాత నిలబడుతుందా లేదా అనేది చూడాలి. కానీ, మొదటి రోజు మాత్రం కళ్ళు చెదిరే ఓపెనింగ్ సాధించింది.
ALSO READ: Brahmastra review: Ambitious effort but lacks punch