‘బ్రో’కి ఏపీలో కష్టాలు తప్పవా?

- Advertisement -
Bro Movie

పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ఈ నెలాఖరున విడుదల కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా కన్పిస్తారు. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఐతే, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు కష్టాలు తప్పకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తన జనసేన రాజకీయ పార్టీ కలాపాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర సందర్భంగా ఇటీవల ఆయన చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయ వేడిని రగిలించాయి. అధికార పార్టీ వైస్సార్సీపీ, పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతోంది. దాంతో, “బ్రో” సినిమా విడుదల ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

టికెట్ రేట్ల పెంపు అనేది ఉండకపోవచ్చు. అలాగే థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలకు మించి అవకాశం రాకపోవచ్చు. ఆ విధంగా చూస్తే డిస్ట్రిబ్యూటర్లకు గిట్టుబాటు కాదు. మొదటి రెండు, మూడు రోజుల్లోనే వీలైనంత ఎక్కువ వసూళ్లు పొందాలని డిస్ట్రిబ్యూటర్లు చూస్తారు. అందుకే, ఈ సినిమా విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అనుకుంటున్నారట.

పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఆయన సినిమాలకు ఎప్పుడూ ఇబ్బందికరమే. నిర్మాతలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని సినిమాలు చేస్తున్నారు.

More

Related Stories