‘ఉప్పెన’ దర్శకుడు రెండేళ్లు వృధా!

NTR and Buchi Babu


‘ఉప్పెన’ హిట్ కాగానే దర్శకుడు బుచ్చిబాబుకి ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఎన్టీఆర్ తో ముందు నుంచి ఆ దర్శకుడికి అనుబంధం ఉంది. ‘ఉప్పెన’ సినిమా ట్రైలర్ లాంచ్ కూడా ఎన్టీఆర్ చేశారు. అతన్ని ప్రోత్సహించారు. దాంతో, బుచ్చిబాబు ఎన్టీఆర్ నుంచి పిలుపు రాగానే ఉబ్బితబ్బిబ్బు అయి ఆయనికి కథ రాసే పనిలో పడ్డారు.

‘స్పోర్ట్స్’ బ్యాక్ డ్రాప్ లో కథ రెడీ అయింది. ఐతే, బుచ్చిబాబు చెప్పిన కథపై పూర్తిగా నమ్మకం కలగలేదో, లేక తన స్టార్ డంని ఈ కుర్ర దర్శకుడు హ్యాండిల్ చేయగలడా అన్న డౌట్ వచ్చిందో కానీ ఇప్పుడు వీరి కాంబినేషన్ లో సినిమా లేదు. ఇప్పుడు మీతో సినిమా చెయ్యలేను అని ఎన్టీఆర్ బుచ్చిబాబుకి చెప్పాడట. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు ముందు పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత మళ్లీ మనం కలుద్దాం అని చెప్పి పంపారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ తనకి ఓకే చెప్పారని ఉప్పెన దర్శకుడు రెండేళ్లు ఆ స్క్రిప్ట్ పై కూర్చున్నారు. ఆ సమయం అంతా వృధా.

ఐతే, పెద్ద హీరోలతో ఇలాగే ఉంటుంది ఈ ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హరీష్ శంకర్ సినిమా కూడా రెండేళ్లుగా ముందుకు కదలడం లేదు. త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడికి మహేష్ బాబు కోసం నెలల తరబడి వెయిట్ చెయ్యకతప్పలేదు.

 

More

Related Stories