ఒకే నెలలో మళ్ళీ బన్ని, నాని!

Pushpa 2 and Saripodhaa Sanivaaram

అల్లు అర్జున్ గత చిత్రం ….పుష్ప. ఇప్పుడు దాని రెండో భాగం “పుష్ప 2” షూటింగ్ తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. “పుష్ప 2” ఆగస్టు 15, 2024న విడుదల కానుంది. ఈ డేట్ ని చాలాకాలం క్రితమే ప్రకటించింది టీం. ఈ సినిమా డిసెంబర్ కి వాయిదా పడొచ్చని ఆ మధ్య ప్రచారం జరిగింది కానీ టీం మాత్రం ఈ డేట్ మారదు అని చెప్తోంది. దాంతో, ఆగస్టు 15న రావాలనుకున్న సినిమాలు వేరే డేట్ ని ఫిక్స్ చేసుకుంటున్నాయి.

అలా తాజాగా నాని కొత్త సినిమాకి డేట్ ని ప్రకటించారు. నాని హీరోగా “సరిపోదా శనివారం” అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని ఆగస్టు 29న విడుదల చేస్తామని తాజగా టీజర్ ద్వారా తెలిపారు. అంటే అటు బన్ని, ఇటు నాని ఈ ఆగస్టు నెలలో తమ సినిమాలతో మన ముందుకు రానున్నారు.

గమ్మత్తు ఏమిటంటే, “పుష్ప” విడుదలైన 2021లో కూడా ఇలాగే జరిగింది. “పుష్ప” డిసెంబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. ఒక వారం గ్యాప్ తర్వాత అంటే డిసెంబర్ 24న నాని నటించిన “శ్యామ్ సింగ రాయ్” విడుదలైంది. కేవలం వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి.

ఇపుడు మళ్ళీ ఒకే నెలలో (ఆగస్టు 2024) నాని, బన్నీ సినిమాలు వస్తున్నాయి. కాకపొతే ఈ సారి రెండు సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్ ఉండబోతోంది.

Advertisement
 

More

Related Stories