‘క్షణ క్షణం నచ్చి రిలీజ్ చేస్తున్నా’

Kshana Kshanam

ఒక చిన్న సినిమాని చూసి ఆ సినిమాని బన్నీ వాసు కొన్నారంటే అందులో ఎదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ‘క్షణ క్షణం’ సినిమాని చూసి బన్నీ వాస్ ఇంప్రెస్ అయ్యారట. ఉదయ్ శంకర్, జియాశర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి డాక్టర్ వర్లు, మన్నం చంద్ర మౌళి నిర్మాతలు. మేడికోండ కార్తీక్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 26న గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది.

“రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని లెక్కలు వేసుకుని చేస్తాం. కానీ ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమా చేస్తున్నప్పుడు నేను అది ఎక్సీపిరియన్స్ చేశాను.’క్షణక్షణం’తో అలాంటి ధైర్యం చేసిన వర్ల గారిని, మౌళి గారిని అప్రిషియేట్
చేస్తున్నాను. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. సినిమా నచ్చడంతో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఉదయ్ శంకర్ ను ఆయన మొదటి సినిమా ఆటగదరా శివ నుంచి చూస్తున్నాను, ” అని అన్నారు బన్నీ వాస్.

వాల్ట్ డిస్నీకి సినిమాలే ప్రపంచం. ఆయన సంపాదన అంతా సినిమా మేకింగ్ మీద పెట్టేవాడు. అంత ప్యాషన్ సినిమాలు అంటే. నేను అదే ప్యాషన్ ను ఉదయ్ లో చూశాను. వాళ్ల నాన్న నాకు ఫ్రెండ్. మెడిసిన్ చదవమంటే సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు,” అన్నారు నిర్మాత వర్లు.

More

Related Stories