బన్ని గుంపులో గోవిందయ్య కాదు

అల్లు అర్జున్ ఎప్పుడూ లేట్ గా స్పందిస్తాడని అనుకుంటారు. ఏ సెలబ్రిటీకైనా అవార్డు వచ్చినా, వాళ్ళు ఏదైనా సాధించినా వెంటనే హీరోలు, దర్శకులు వెంటనే స్పందించి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు పెడుతారు, ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ పోస్ట్ చేస్తారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం ఒక రోజు అంతా వెయిట్ చేసి లేట్ గా విషెస్ చెప్తారు.

ఇలా లేట్ గా బన్నీ ఎందుకు పోస్ట్ చేస్తారు? ఆయన సోషల్ మీడియా ప్రమోషన్ కోసమే పెద్ద టీం ఉంది. ఆయన స్టాఫ్ పెద్దది. ఆయనకి సమాచారం ఎప్పటికప్పుడు వస్తుంటుంది. అయినా కూడా ఎందుకు వెంటనే స్పందించరు అనే డౌట్ చాలా మందిలో ఉంది.

ఐతే బన్నీ స్ట్రాటజీ డిఫరెంట్. వెంటనే రెస్పాండ్ ఐతే మీడియాలో కవరేజ్ ప్రత్యేకంగా ఉండదు. అందరి సెలెబ్రిటీల విషెష్ తో తనది కూడా కలిపేస్తారు అని ఆయన భావిస్తున్నట్లు టాక్. అదే ఒక రోజు లేట్ గా వస్తే మీడియా తన విషెస్ ని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకంగా ట్రెండ్ అవుతాను అని ఆయన ఆలోచన.

అందుకే, ఆయన గుంపులో గోవిందయ్యలా అదే రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇష్టపడరు. ఇప్పుడు “నాటు నాటు” పాటకి ఆస్కార్ వచ్చిన సందర్భంలోనూ ఒక రోజు తర్వాత ట్వీట్ చేశారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ‘గ్లోబల్’ స్థాయిలో తన పేరు మార్మోగాలని అనుకుంటున్నారు.

 

More

Related Stories