అది అసలు వివాదమే కాదట!

NTR as Komaram Bheem

‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఎన్టీఆర్ టీజర్ సృష్టించిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న ఎన్టీఆర్ ను, టీజర్ చివర్లో ముస్లిం గెటప్ లో చూపించారు. దీనిపై ఆదివాసీలతో పాటు, అదిలాబాద్ ఎంపీ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై దర్శకుడు రాజమౌళి నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. యూనిట్ లో కీలక సభ్యులు కూడా ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. అయితే ఒకరు మాత్రం ఈ వివాదంపై స్పందించాడు. ఆయనే సాయిమాధవ్ బుర్రా.

‘ఆర్ఆర్ఆర్’కు మాటల రచయితగా పనిచేస్తున్న సాయిమాధవ్.. ఎన్టీఆర్ టీజర్ పై చెలరేగుతున్న వివాదాల్ని కొట్టిపారేశాడు. ప్రస్తుతం అంతా కాంట్రవర్సీ అనుకుంటున్న అంశం, అసలు వివాదమే కాదంటున్నాడు సాయిమాధవ్. అంతకుమించి స్పందించడానికి అంగీకరించని ఈ డైలాగ్ రైటర్.. సినిమా చూస్తే ఈ విషయం అందరికీ అర్థమౌతుందని చెబుతున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సిన అవసరం తనకు పెద్దగా రాలేదంటున్న సాయిమాధవ్.. ఎన్టీఆర్ గెటప్ లో మాత్రం ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదని గట్టిగా చెబుతున్నాడు.

సినిమా కథలో భాగంగా కొమరం భీం (ఎన్టీఆర్) ఇలా మారువేషం వేస్తాడనే ప్రచారం ఇప్పటికే సోషల్ మీడియాలో నడస్తోంది. ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా ఉన్నాయి సాయిమాధవ్ మాటలు.

Related Stories