‘బుట్ట బొమ్మ’ దర్శకుడి ముచ్చట్లు

‘బుట్ట బొమ్మ సినిమాతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేష్ ఈ సినిమాకి సంబంధించి చెప్పిన ముచ్చట్లు…

సినిమాల్లోకి ఎలా వచ్చారు?

మాది గుంటూరు. కానీ పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. మాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. పీజీ పూర్తి చేసి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాను.

రామ్ గోపాల్ వర్మ గారికి చెందిన వర్మ కార్పొరేషన్ లో పనిచేశాను. ఆయన నిర్మించిన శూల్ అనే హిందీ ఫిల్మ్ చేశాను. ఆ చిత్రానికి ఈశ్వర్ నివాస్ దర్శకుడు. ఆయన దగ్గరే వరుసగా నాలుగు హిందీ సినిమాలకు వర్క్ చేశాను. ఆ తరువాత మా నాన్నగారు మరణించడంతో హైదరాబాద్ వచ్చేశాను. సుకుమార్ గారి దగ్గర జగడం నుంచి పుష్ప సినిమా వరకు పని చేశాను.

మొదటి సినిమానే రీమేక్ ఎంచుకోవడానికి కారణమేంటి?

లాక్ డౌన్ సమయంలో “కప్పేల” చిత్రాన్ని చూశాను. చాలా నచ్చింది. ఇది పూర్తిగా స్క్రిప్ట్ మీద ఆధారపడిన సినిమా. దీనిని మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసి, రీమేక్ చేస్తే బాగుంటుందనే నమ్మకం కలిగింది.

కథలో ఉన్న బలం. కథనం నన్ను బాగా ఆకట్టుకుంది. మలయాళ సినిమాలు అయ్యప్పనుమ్ కోషియం, కప్పేల ఈ రెండు చూసినప్పుడు తెలుగులో చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పటికే ఆ రీమేక్ హక్కులను సితార సంస్థ తీసుకొని, అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ను సాగర్ చంద్రతో ప్రకటించారు. కప్పేల రీమేక్ చేయబోతున్నారని తెలిసి, నేనే వారిని సంప్రదించాను.

హీరోయిన్ పాత్ర చాలా అమాయకంగా, పల్లెటూరి అమ్మాయిలా ఉండాలి. గౌతమ్ మీనన్ గారి క్వీన్ వెబ్ సిరీస్ లో అనిఖా సురేంద్రన్ ను చూసినప్పుడు ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. అర్జున్ దాస్ ఎంపిక మాత్రం వంశీ గారి సూచన మేరకు జరిగింది. సూర్య పేరును చినబాబు గారు, వంశీ గారు ఇద్దరూ సూచించారు. ఆడిషన్ చేశాక ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడు అనిపించి ఎంపిక చేశాం.

తెలుగు కోసం ఎలాంటి మార్పులు చేశారు?

మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ఫస్టాఫ్ లో కీలక మార్పులు చేయడం జరిగింది. కామెడీ, ఎమోషన్స్ మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం. ఫస్టాఫ్ లో కథనం పరంగా ఒక పెద్ద మార్పు కూడా చేశాం. అది చూస్తే ఆ డైరెక్టర్ గారు కూడా ఈ ఆలోచన మనకు వస్తే బాగుండేది అనుకుంటారు అనిపిస్తుంది.

బుట్టబొమ్మ టైటిల్ వంశీ గారు సూచించారా?

సినిమాలోనే ఒక కాన్సెప్ట్ రన్ అవుతుంది. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది అనుకున్నప్పుడు అప్పటికే ‘బుట్టబొమ్మ’ సాంగ్ బాగా పాపులర్ కావడంతో అదే టైటిల్ పెడితే బాగుంటుందని వంశీ గారు సూచించారు. అలా ఈ టైటిల్ ఖరారైంది.

నెక్స్ట్ ఏంటి?
కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి సినిమా యాక్షన్ జోనర్ లో చేయాలని ఉంది.

Advertisement
 

More

Related Stories