
సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ జూలై 30న విడుదల కాబోతోంది. ఈ సినిమా తనకి కొత్త ఫీలింగ్ కలిగించింది అని చెప్తున్నారు ఈ హీరో.
“ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య… నేటి తరం ప్రేక్షకుల కోసం చేశాం. ఫైటింగ్ లు, డ్యాన్స్ లు వంటి రూట్ లో వెళ్లట్లేదు నేను. కానీ ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య సినిమా తర్వాత…. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలనుకున్నాను. అలా సెట్ అయింది ఈ మూవీ,” అని చెప్పారు సత్యదేవ్.
కోవిడ్ పీక్ లోనే ఈ మూవీ షూటింగ్ జరిగింది. “39 రోజుల్లో పూర్తి చేశాం. ఇక నా పాత్ర విషయానికొస్తే… లాయర్ కోణం నుంచి సాగే థ్రిల్లర్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే ‘అభిలాష’లో చిరంజీవిగారిలా నా పాత్ర ఉంటుంది,” అంటూ సినిమా గురించి మరిన్ని కబుర్లు చెప్పారు.
సత్యదేవ్ నటించిన తొలి చిత్రం … “మిస్టర్ పర్ఫెక్ట్”. ప్రభాస్ హీరోగా నటించిన ఆ సినిమాలో చిన్న రోల్ లో కన్పిస్తారు సత్యదేవ్. 10 ఏళ్ల కెరియర్ పూర్తి అయింది.
“నిజం చెప్పాలంటే ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయ్యింది. రకరకాల చిత్రాలు చేస్తున్నాను. ‘గాడ్సే’ అనే మూవీ ఉంది. తమన్నాతో కలిసి చేస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ కంప్లీట్ లవ్‌స్టోరి. ‘స్కైలాబ్” అనేది పీరియడ్ మూవీ. కృష్ణగారు, కొరటాలగారు నిర్మిస్తోన్న మరో సినిమా రా మూవీ. ఇలా ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుంది,” అని అంటున్నారు.
సత్యదేవ్ బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నారు. అక్షయ్ కుమార్ నటిస్తోన్న “రామ్‌సేతు” సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో సత్యదేవ్ కీలక రోల్ లో కనిపిస్తారు.