అనుకి ఇప్పుడు దశ తిరిగేనా?

Anu Emmanuel

అను ఇమ్మాన్యూల్ కి ఇప్పటివరకు నటిగా పెద్దగా పేరు రాలేదు. పెద్ద పెద్ద సినిమాల్లో నటించినా ఆమె చేసినవన్నీ కూరలో కరివేపాకు పాత్రలే. అందుకే, అనుకి సరైన గుర్తింపు రాలేదు. ఐతే, ఇప్పుడు చిన్న సినిమా ఆమెకి ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టింది.

గతవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’లో ఆమె పాత్ర కీలకం. హీరో, హీరోయిన్ ఇద్దరిదీ సమానమైన పాత్ర. ఒకవిధంగా చెప్పాలంటే హీరో కన్నా బలమైన పాత్ర. ‘ఊర్వశివో రాక్షసివో’కి మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ, కలెక్షన్లు మాత్రం లేవు.

వసూళ్ల సంగతి ఎలా ఉన్నా.. అను ఇమ్మాన్యూల్ కి పెద్ద సినిమాలతో రాని పేరు ఈ సినిమాతో వచ్చింది. ఆ విధంగా ఆమెకి ఇది పెద్ద ప్లస్.

మరి, ఇపుడైనా ఈ బ్యూటీ దశ తిరుగుతుంది. అంతే కాదు, ముద్దుల సీన్లలో హద్దులేని చెరిపేసింది. ఆ విధంగా హాట్ నెస్ లో కూడా తగ్గేదే లే అని ప్రూవ్ చేసింది. సో, ఇటు యూత్ సినిమాలకు బాగా సరిపోతానని ప్రూవ్ చేసింది ఈ 26 ఏళ్ల సుందరి.

Anu Emmanuel

ప్రస్తుతం ఆమె చేతిలో రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘రావణాసుర’ ఉంది. అందులో ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తుంది. సోలో భామగా అవకాశాల కోసం చూస్తోంది.

Advertisement
 

More

Related Stories