ఈ సారైనా అది సాధిస్తాడా?

సాలిడ్ హిట్ కోసం కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నాలు గతేడాది ఫలించాయి. 2022లో విడుదలైన ‘బింబిసార‌’ క‌ళ్యాణ్ రామ్‌ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. అదే ఊపులో ‘అమిగోస్’ అనే సినిమా చేశారు కళ్యాణ్ రామ్. కొత్త దర్శకుడు రాజేంద్ రెడ్డి తీసిన ఈ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ విభిన్నమైన పాత్రలు పోషించారు. ఏకంగా మూడు పాత్రలు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలో ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని’ అనే బాలయ్య హిట్ సాంగ్ ని రీమిక్స్ చేశారు.

కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ లుక్స్, టీజర్ల కారణంగా సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.

మరి ఇది మరో ‘బింబిసార’ అవుతుందా? వరుసగా రెండు హిట్స్ కళ్యాణ్ రామ్ అందించగలడా. అతని కెరీర్ లో ఇప్పటివరకు వరుసగా రెండు పెద్ద హిట్స్ రాలేదు. ఈ సారైనా కళ్యాణ్ రామ్ ట్రెండ్ సెట్ చేస్తారా?

 

More

Related Stories