పాయల్ పై పెద్దపల్లిలో కేసు

- Advertisement -
Paayal Rajput


హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌పై కేసుని నమోడు చేశారు పెద్దపల్లి పోలీసులు. తెలంగాణలోని పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి  పాయల్‌ రాజపుత్ వెళ్లారు. షాప్ ఓపెనింగ్ చేసి… అక్కడ సందడి చేశారు. అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ లు కూడా ఇచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆమె కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేసింది.

ఈవెంట్ లో ఎక్కడా ఆమె మాస్కు ధరించలేదట. దాంతో పెద్దపల్లికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తి స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు.

షాప్ యజమానిపై కూడా కేసు పెట్టారు. రిబ్బన్ కటింగ్ ఈవెంట్స్ కి వెళ్ళినపుడు హీరోలు, హీరోయిన్లు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఎలా?

అర్ ఎక్స్ 100, వెంకీమామ వంటి హిట్ సినిమాల్లో నటించిన పాయల్ రాజపుత్ కి తెలుగునాట మంచి పాపులారిటీ ఉంది. ఐతే, ఆమెకి ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు.

 

More

Related Stories