
హీరోయిన్ నిహారిక భర్త చైతన్య, ఆయన అపార్ట్ మెంట్ వాసుల మధ్య రేగిన గొడవ సద్దుమణిగింది. పోలీసులు అందరిననీ కూర్చుండబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో, ఇరువర్గాలు రాజీకొచ్చాయి.
నిహారిక, ఆమె భర్త కలిసి హైదరాబాద్ లో కాపురం పెట్టారు. ఐతే, చైతన్య బంజారాహిల్స్ లోని ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్‌ను రెంట్ కి తీసుకొని దాన్ని ఆఫీస్ వ్యవహారాలకు వాడుతున్నారట. ఈ ఆఫీస్ కి వచ్చేపోయే వారి సంఖ్య ఎక్కువ కావడంతో అపార్టుమెంట్ వాసులు చైతన్యతో గొడవ పెట్టుకున్నారు. తమ అపార్ట్ మెంట్ లో ఆఫీస్ ఉండొద్దని అతనికి చెప్పినా పెడచెవిన పెట్టారని, గొడవకు దిగారు. దాంతో పెద్ద రగడ జరిగింది.
ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అపార్ట్ మెంట్ లోని సీసీటీవీ ఫ్యూటేజ్ చూసి… సమస్యని పరిష్కరించారు. సింపుల్ గా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సిన విషయంలో గొడవపడటం ఏంటని పోలీసులు ఇరువురికి క్లాస్ పీకారు. చైతన్య కూడా ఆఫీస్ పేరుతో ఇతర రెసిడెంట్స్ కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పారు. దానికి ఆయన ఒప్పుకున్నారు. అపార్ట్ మెంట్ వాసులు కూడా ఓనర్ తో మాట్లాడకుండా… డైరెక్ట్ గా చైతన్య ఫ్లాట్ కి వెళ్లి గొడవపడటం ఏంటని మందలించారు.
ALSO READ: Niharika’s husband Chaitanya lands in a trouble

ఆ తర్వాత చైతన్య మీడియాతో మాట్లాడారు. “అపార్ట్‌మెంట్ వాసులకు సరైన సమాచారం లేదు. వారు అపోహలతో నా ఫ్లాట్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వారికి క్లారిటీ వచ్చింది. సమస్య పరిష్కారం అయింది,” అని చైతన్య తెలిపారు.