కమ్ములని ఫాలో అవుతోన్న చై

Love Story

దాదాపు ఏడాదిన్నరగా షూటింగ్ జరుపుకుంటున్న ”లవ్ స్టోరీ” సినిమాకు ఇటీవల గుమ్మడికాయ కొట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

”ఫిదా” తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా ఇదే. తెలంగాణలోని రూరల్ ఏరియాకు చెందిన ఓ అబ్బాయి, ఓ అమ్మాయి హైదరాబాద్ వచ్చి తమ కలల్ని ఎలా సాకారం చేసుకున్నారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది. నాగచైతన్య ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాడు. చైతన్య తెలంగాణ యాసలో డైలాగ్స్ ఎలా చెప్పాడు అనేదే అందరిలో ఉన్న డౌట్.

ఆ బాధ్యత మొత్తం శేఖర్ కమ్ముల తీసుకున్నాడట. ఈ సినిమాకి సంబంధించినంతవరకు డైలాగ్ డెలివరీని మొత్తం కమ్ములని ఫాలో అవుతున్నాడు చైతన్య.

Related Stories