చైత్ర ఫ్యామిలీకి జనసేనాని భరోసా!

చిన్నారి చిత్ర కుటుంబానికి తమ జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అలాగే, దోషికి శిక్ష పడేలా పోరాటం చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్రని పాశవికంగా అత్యాచారం చేసి చంపేశాడు రాజు అనే మృగాడు. పోలీసులు అతని కోసం వేటాడుతున్నారు.

చైత్ర తల్లితండ్రులను పరామర్శించేందుకు ఈరోజు సైదాబాదు వెళ్లారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. పవన్ కారుని చుట్టుముట్టి ముందుకు కదలనివ్వలేదు.

దాంతో, చైత్ర తల్లిని తన కారు వద్దకే రప్పించి ఆమెని ఓదార్చారు జనసేనాని.

“ఈ దారుణం నన్ను కలిచి వేసింది. బాలిక తల్లితండ్రులు రాజుపై ముందే అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు నిందితుడిని పట్టుకొని శిక్ష పడేలా చూడాలి. చైత్ర తల్లితండ్రులకు న్యాయం జరిగేంతవరకు జనసేన పోరాడుతుంది,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

 

More

Related Stories