
చాందిని చౌదరి అచ్చ తెలుగు అమ్మాయి. చాలా కాలంగా హీరోయిన్ గా నటిస్తోంది. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. ఆమె నటించిన సినిమాల్లో కాస్త పేరు వచ్చింది “కలర్ ఫోటో” ఒక్కటే. ఇటీవలే ఆ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ ఆప్ లో రిలీజ్ అయింది. ఆ ఊపును అలానే కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తోంది ఈ చౌదరి సుందరి.
ఐతే, ఆమెకి అప్పుడే ఝలక్ తగిలింది.
ఆమె నటించిన మరో మూవీ… “బొంబాట్”. ఈ సినిమా కూడా లేటెస్ట్ గా అమెజాన్లో విడుదలైంది. సినిమా చూసిన వారంతా “ఏంటి ఈ దరిద్రం” (ఆ మూవీలో తరుచుగా వినిపించే డైలాగ్) అని అంటున్నారని సోషల్ మీడియా కామెంట్స్ ని బట్టి అర్థమవుతోంది. చాందిని నటన, ఎక్స్ ప్రెషన్లు కూడా బాడ్ అని అంటున్నారు. దర్శకుడు సైన్స్ ఫిక్షన్ పేరుతో హింస పెట్టాడనేది క్రిటిక్స్ మాట. హింసలోనూ “అదో రకం”.
అంటే, చాందిని సీన్ మళ్ళీ మొదటికొచ్చింది అన్నమాట.