చంద్రబాబుతో పవన్ మళ్ళీ జట్టు!

పవన్ కళ్యాణ్ మరోసారి చంద్రబాబు నాయుడితో కలిసి తన రాజకీయ ప్రయాణం సాగించాలి అని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి 2019 ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో విడిపోయారు.

ఇప్పుడు మరోసారి చేతులు కలిపేందుకు మార్గం సుగమం అయింది. ఆదివారం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి అక్కడ చర్చలు జరిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2024 వేసవిలో ఎన్నికలు జరుగుతాయి. సరిగ్గా ఏడాది కాలమే ఉంది ఎన్నికలకు. ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వాలి. అందుకే, పొత్తులు, ఎత్తులు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే రాజకీయ కలాపాలు చేస్తున్నారు.

మొన్న బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య అలయన్స్ ఏర్పడే అవకాశం ఉందని అర్థమైంది. ఐతే, ఇటీవల డల్లాస్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు, తెలుగు దేశం అభిమానులు కొట్టుకోవడంతో పొత్తు ఆలోచన వికటించిందా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ, అలాంటిదేమి లేదని ఆదివారం నాటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికతో అర్థమైంది.

 

More

Related Stories