- Advertisement -

రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ ఒక సంచలన విజయం. 18 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్ వస్తోంది. కాకపోతే, ఈ సీక్వెల్ లో హీరో… రాఘవ లారెన్స్. రజినీకాంత్ నటించడం లేదు. కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం మరో విశేషం.
మొదటి భాగాన్ని తీసిన పి.వాసు ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మిస్తోన్న ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. అంటే సెప్టెంబర్ 15న విడుదల అవుతుంది ఈ మూవీ. అదే రోజు బోయపాటి రామ్ హీరోగా తీస్తున్న ‘స్కంధ’ సినిమా కూడా విడుదల కానుంది. సో, చంద్రముఖి 2 వర్సెస్ స్కంధ.
ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యం అందిస్తున్నారు.