బాలయ్య డాన్స్ సూపర్: చంద్రిక

ఎప్పటికప్పుడు ఐటెం గర్ల్స్ పరిచయం అవుతుంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. తాజాగా ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ ….చంద్రిక రవి. బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ‘వీర సింహ రెడ్డి’ సినిమాలో ఆమె “మా బావ మనోభావాలు” అనే పాటలో ఆడిపాడింది. ఈ బ్యూటీతో ముచ్చట్లు.

‘మా బావ మనోభావాలు’ పాటలో అవకాశం గురించి చెప్పండి?

పాటకి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా వుంది. ఈ పాట నా జీవితాన్ని గొప్పగా మార్చింది. ఆస్ట్రేలియాలో ఓ చిన్న టౌన్ లో పుట్టాను. అయితే మా కుటుంబ మూలాలు దక్షిణ భాతరదేశం లో వున్నాయి. చిన్నప్పటి నుండి సౌత్ సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు ఈ సినిమాలో అనుకోకుండా అవకాశం వచ్చింది.

బాలకృష్ణతో పని చేయడం ఎలా ఉంది?

బాలకృష్ణ గారితో పని చేయడం ఒక కల నెరవేరినట్లయింది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన అంటే ఎంతో అభిమానం. ఆయనతో డ్యాన్స్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. బాలకృష్ణ గారు అద్భుతమైన డ్యాన్సర్.

మా బావ మనోభావాలు పాట చిత్రీకరణలో మీరు ఎదురుకున్న సవాల్ ఏమైనా ఉందా?

షూటింగ్ చేస్తుండగా వెన్ను కాస్త బెణికింది. ఐతే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నొప్పితోనే మిగతా షూటింగ్ పూర్తి చేశా. తర్వాత విషయం తెలుసుకున్న దర్శకుడు గోపీచంద్,శేఖర్ మాస్టర్ అభినందించారు.

ఈ పాటలో హనీ రోజ్ కూడా ఉన్నారు కదా ఆమెతో కలసి పని చేయడం ఎలా అనిపించింది?

హనీ రోజ్ తో కలసి పని చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మేము ఇద్దరం మలయాళీలమే. చాలా ఫ్రెండ్లీ గా పని చేశాం.

నెక్స్ట్ సినిమాలు?

తమిళంలో ఒక మూవీ ఒప్పుకున్నా. తెలుగులో ఇంకోటి చర్చల దశలో ఉంది.

Advertisement
 

More

Related Stories