మేజర్ ఫార్ములా ఫాలో అవుతున్న చార్లీ

అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాకు డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. సినిమా విడుదలకు 2 వారాల ముందు నుంచే దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటుచేశారు. ఈ ప్రచార ఎత్తుగడ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడీ ఫార్ములాను మరో సినిమా కూడా ఫాలో అవ్వబోతోంది. అదే చార్లీ-777.

రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో కుక్క ప్రధాన పాత్ర పోషించింది. దాని పేరే చార్లీ. ఈ సినిమాపై రక్షిత్ శెట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే రిలీజ్ కు ముందే కర్నాటకలోని దాదాపు 100 సెంటర్లలో సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలని నిర్ణయించాడు. తెలుగు-కన్నడ భాషల్లో జూన్ 10న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. తెలుగులో ఈ సినిమాను హీరో రానా ప్రజెంట్ చేస్తున్నాడు.

ధర్మ అనే వ్యక్తి జీవితంలో చార్లీ అనే కుక్క ఎలాంటి పాత్ర పోషించింది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడిందనేది ఈ సినిమా స్టోరీ. భారీగా ఖర్చు పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్రచారం చేయాలని అనుకున్నారు. కానీ విరాటపర్వం రిలీజ్ ముందుకు జరగడంతో రానా బిజీ అయిపోయాడు.

దీంతో ప్రస్తుతానికి తెలుగు-కన్నడ భాషల్లో మాత్రం ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రెస్పాన్స్ బట్టి మిగతా భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తారు. 

 

More

Related Stories