రూమర్లని పట్టించుకోని ఛార్మి


హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాధ్ మధ్య ఉన్న బంధం గురించి మరోసారి ఫోకస్ పడింది. ఎందుకంటే, ఇప్పుడు ఇండియా అంతా లైగర్ వైపు చూపు వేసింది. ఈ సినిమా వెనుక ఉన్న బ్రెయిన్ ఛార్మి.

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ సెట్ కాగానే దీన్ని పాన్ ఇండియా చిత్రంగా మార్చాలని, కరణ్ జోహార్ తో చేతులు కలపాలని ఛార్మి ప్లాన్ చేశారు. ఇప్పుడు సినిమా ప్రొమోషన్ లలో భాగంగా బాలీవుడ్ మీడియాకి ఛార్మి చేరువైంది. దాంతో, సహజంగానే ఆమె పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు వేశారు బాలీవుడ్ జర్నలిస్టులు.

పూరితో అనుబంధం కేవలం నిర్మాతగానేనా అని అడిగేశారు. ఆమె చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. తన గురించి వచ్చే రూమర్లు, ప్రచారం గురించి పట్టించుకోను అని చెప్పారు.

Charmee

“లైగర్, జన గణ మన వంటి రెండు ప్రాజెక్టులు పూర్తి చేశాను. నన్ను ఇక అందరూ ఒక నిర్మాతగా గుర్తిస్తారు. అది ముఖ్యం. మిగతా మాటలు పట్టించుకోను,” అని ఛార్మి క్లారిటీ ఇచ్చారు.

ఛార్మి, పూర్ జగన్నాధ్ కలిసి సినిమాల నిర్మాణం చేస్తున్నారు గత ఐదేళ్లుగా.

 

More

Related Stories