
లాక్డౌన్ ప్రకటించే ముందు నుంచి పూరి జగన్నాధ్ ముంబైలోనే ఉంటున్నాడు. ఆయన ప్రొడక్షన్ పార్ట్నర్ ఛార్మి మధ్యలో రెండు సార్లు హైదరాబాద్ వచ్చింది. కానీ పూరి మాత్రం ముంబైలోనే ఉండిపోయాడు. ఐతే, ఇప్పుడు పూరి హైదరాబాద్ వచ్చాడు. దాంతో హీరో విజయ్ దేవరకొండ తన దర్శకుడు పూరికి, నిర్మాత ఛార్మికి నిన్న తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చాడు.
నిన్న పార్టీ అదిరిపోయింది అంటోంది చార్మీ. దేవరకొండ బెస్ట్ హోస్ట్ అని కూడా కితాబు ఇచ్చింది. విజయ్ దేవరకొండ తల్లి నాకు మంచి డాన్స్ పార్ట్నర్ అంటూ ఆ ఫోటోని కూడా షేర్ చేసింది ఛార్మి.
విజయ్ హీరోగా పూరి రూపొందిస్తోన్న బాక్సింగ్ డ్రామా గత ఏడాది కాలంగా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమా ఇప్పటివరకు 40 శాతమే పూర్తి అయింది. మిగతా భాగాన్ని త్వరలోనే షూట్ చేస్తారట. ఒక పెద్ద సెట్ వేసి అక్కడే పూర్తి చేయాలనుకుంటున్నారు.