నాకింకా 32 మాత్రమే: చార్మి

Charmme


చార్మి హీరోయిన్ గా అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తోంది. ఆమె నటించిన తొలి చిత్రం… “నీ తోడు కావాలి”. ఇది విడుదలై నేటికీ 19 ఏళ్ళు. అంటే షూటింగ్ ప్రారంభం అయినప్పటి టైం కూడా లెక్కిస్తే… చార్మి హీరోయిన్ గా అడుగుపెట్టి 20 ఏళ్ళు.

కానీ తన ఏజ్ మాత్రం 32 అంటోంది.

అవును… లేటెస్ట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. “నీ తోడు కావాలి” సినిమా ఒప్పుకున్నప్పుడు తన వయసు కేవలం 13 ఏళ్ళు అని రాసుకొంది. 13 ఏళ్లకే తాను కొత్త పెళ్లికూతురు పాత్ర పోషించాను అని చెప్పుకొంది. ఇన్ డైరెక్ట్ గా తనకింకా నిండా ముప్ఫై రెండే అని చెప్తోంది చార్మి.

ప్రస్తుతం చార్మి నిర్మాతగా కొనసాగుతోంది. పూరి జగన్నాధ్ తీసే సినిమాలకు సంబంధించి నిర్మాణ బాధ్యతలన్నీ ఆమె నిర్వహిస్తోంది.

More

Related Stories