ఛత్రపతిని తెగ తిడుతున్నారుగా

- Advertisement -
Chatrapathi Hindidue


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఆశలు గల్లంతు అయ్యాయా? ఆయన మొదటి చిత్రం ‘ఛత్రపతి’కి వస్తున్న స్పందనని బట్టి సమాధానమే అవును అనే చెప్పాల్సి వస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేసింది వీవీ వినాయక్. ఆయనే ఇప్పుడు సాయి శ్రీనివాస్ ని హిందీకి పరిచయం చేశారు.

రాజమౌళి 2005లో తీసిన ‘ఛత్రపతి’ సినిమాకి రీమేక్ గా రూపొందింది. ఐతే, ఈ సినిమాని బాలీవుడ్ క్రిటిక్స్ చీల్చి చెండాడారు. ఇదో సినిమానా అని ఈసడించుకున్నారు. అంతే కాదు, 1980లలో ఇంతకన్నా బెటర్ గా తీశారు కదా అని కామెంట్ చేస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. రేటింగ్స్ కూడా అంతే దారుణంగా ఉన్నాయి.

రాజమౌళి అప్పట్లో ఇంత సిల్లీ సినిమాలు తీసేవారా అని మరికొందరు బాలీవుడ్ క్రిటిక్స్ ఆశ్చర్యపోయారు. బెల్లంకొండ, వినాయక్ వల్ల రాజమౌళికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది.

ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ గురించి ఎంత చెప్తే అంత తక్కువ. చాలా పేలవమైన ఓపెనింగ్. బెల్లంకొండ సాయి నటించిన తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి రెగ్యులర్ గా విడుదల చేస్తుంటారు. ఆయన సినిమాలకు యూట్యూబ్ లలో మిలియన్ల కొద్దీ వ్యూస్. అందుకే, తనకు హిందీలో పెద్ద మార్కెట్ ఉందని బెల్లంకొండ భావించాడు. తన సినిమాని చూసేందుకు హిందీ ప్రేక్షకులు ఎగబడుతారు అనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాడు.

కానీ వచ్చిన ఫలితం వేరు. అంతా రివర్స్.

More

Related Stories