స్పెషల్ ట్రీట్ మిస్సయిన రకుల్

Rakul

కొందరికి కొన్ని పాత్రలు కెరీర్ లో చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ ఒకటి రకుల్ కు దొరికింది. అదే ‘చెక్’ సినిమాలో క్రిమినల్ లాయర్ పాత్ర. ఇంతకుముందు ‘కథానాయకుడు’ సినిమాలో ఆమె లాయర్ గా కనిపించినప్పటికీ.. అది కేవలం ఒకే ఒక్క సీన్. కానీ ‘చెక్’లో మాత్రం రకుల్ ది చాలా కీలకమైన లాయర్ పాత్ర.

ఇలాంటి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తే ఆ కిక్కే వేరు. అయితే అలాంటి అవకాశాన్ని ఈరోజు ”చెక్” యూనిట్ మిస్ చేసుకుంది. మిస్ చేసుకుంది అనే కంటే చేజేతులా వదులుకుంది అనడం కరెక్ట్.

నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ను కొన్ని రోజుల కిందట ఎనౌన్స్ చేశారు. ఆ సందర్భంగా కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. అందులో రకుల్ లాయర్ గెటప్ తో ఉంది. అదే స్టిల్ ను ఈరోజు రిలీజ్ చేసి ఉంటే ఆమెకు ఆన్ లైన్ లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పినట్టు ఉండేది. సినిమాకు ప్రచారం కూడా వచ్చేది.

కానీ టీమ్ మాత్రం ఇంతకుముందే ఆ లాయర్ స్టిల్ రిలీజ్ చేసి, మంచి ప్రమోషనల్ యాంగిల్ ను మిస్ అయింది. తప్పదు కాబట్టి ఈరోజు మరో స్టిల్ విడుదల చేశారు.

Related Stories