మహేష్ కి చెల్సీ కన్ఫర్మ్ ఐనట్లే!?

మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తీయబోతున్న భారీ చిత్రం ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఒక అంతర్జాతీయ నటి కనిపిస్తుంది అని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో ఒలివియా మారిస్ అనే బ్రిటిష్ నటిని తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఇండోనేషియన్ భామ నటించనుందనే మాట కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తిరుగుతోంది.

ఈ మాటకు బలం చేకూర్చుతూ తాజాగా ఈ ఇండోనేషియన్ నటి రాజమౌళిని ఇన్ స్టాగ్రామ్ ఫాలో కావడం మొదలు పెట్టింది. చెల్సీ ఎలిజిబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) అనే ఈ భామ దీపిక పదుకోను, రాజమౌళి, దిశా పటానిలను ఫాలో అవుతోంది.

రాజమౌళిని ఫాలో కావడం మొదలుపెట్టగానే ఈ భామ ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అని జనాలు భావించడం మొదలుపెట్టారు.

ఐతే ఈ సినిమాలో ఈ ఒక్క భామే ఉంటుందా మరో ఇండియన్ హీరోయిన్ ఉంటుందా అనేది చూడాలి.

Advertisement
 

More

Related Stories