‘బాలును అలా పిలవడం మానేశా’

బాలుతో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు చిరంజీవి. చెన్నైలో తామిద్దరి ఇళ్లు పక్కపక్క వీధుల్లోనే ఉండేవనే విషయాన్ని నెమరువేసుకున్న చిరు.. బాలు కారణంగానే తన పాటలు అంత పాపులర్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలుకు తనకు మధ్య జరిగిన ఓ మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నారు.

“నా కెరీర్ తొలి దశ నుంచి నన్ను అక్కున చేర్చుకున్న ఆయన్ను అన్నయ్య అని పిలిచేవాడ్ని. తర్వాత కాలంలో బాలు ఎంత గొప్పవారో, ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో అర్థం చేసుకొని మీరు అని సంభోదించేవాడ్ని. మొదట్నుంచి నన్ను అన్నయ్య అని పిలిచేవాడివి. ఇప్పుడు కొత్తగా మీరు అని పిలిచి నన్ను దూరం చేయకు అనేవారు బాలు.”

ఇలా బాలుకు, తనకు మధ్య ఉన్న మధురమైన బంధాన్ని గుర్తుచేసుకున్నారు ¸. కమర్షియల్ స్టార్ గా కొనసాగుతున్న తను.. మధ్యమధ్యలో ఆపద్బాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి లాంటి సినిమాలు చేయడానికి బాలు కూడా ఓ కారణం అంటున్నారు చిరంజీవి. దాగిఉన్న నటుడికి కూడా అవకాశం ఇవ్వాలని బాలు చెప్పడంతోనే తను మంచి సినిమాలు చేయగలిగానని చెప్పుకొచ్చారు.

Advertisement
 

More

Related Stories