దారిచూపించిన బాలయ్య

Chiranjeevi and balakrishna

17 ఏళ్ల కిందట దర్శకుడిగా మారి ‘నర్తనశాల’ తీద్దామనుకున్న బాలయ్య, తప్పనిసరి పరిస్థితుల మధ్య ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేశారు. అప్పట్లో తను నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 2 సన్నివేశాల్ని మాత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్ చేశారు. 17 నిమిషాల నిడివి కలిగిన ఈ సీన్స్ కు నందమూరి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రేయాస్ ఏటీటీలో రిలీజ్ చేసిన ఈ విజువల్స్ కు కోటి రూపాయలకు పైగా కలెక్షన్ వచ్చినట్టు చెబుతున్నారు.

బాలయ్య చేసిన ఈ పని ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. బాలయ్య దారిలో చాలామంది నిర్మాతలు తాము మధ్యలోనే ఆపేసిన సినిమాల్ని ఇలా ఏటీటీ వేదికగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దాదాపు ప్రతి హీరోకు ఇలా ఆగిపోయిన సినిమాలున్నాయి.

బాలయ్యదే కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన “విక్రమసింహభూపతి” అనే సినిమా రిలీజ్ కాకుండా ఉండిపోయింది. కొంత పూర్తయిన ఆ సినిమాను కూడా రిలీజ్ చేయమని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఈ చర్చ ఇతర హీరోల ఫ్యాన్స్ కు కూడా పాకింది.

చిరంజీవి-ఆర్జీవీ కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమై ఆగిపోయింది. దానికి సంబంధించి అప్పట్లో ఓ సాంగ్ కూడా రిలీజైంది. ఇలా బాలయ్య, చిరంజీవి మాత్రమే కాదు.. అగ్రహీరోలందరి కెరీర్లలో షూటింగ్ ప్రారంభమై ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ రిలీజైతే అభిమానులకు పండగే.

Related Stories