మళ్ళీ రంగంలోకి దిగిన చిరంజీవి

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రంగంలోకి దిగారు. కరోనా విజృంభించిన వెంటనే ఉపాధి కోల్పోయిన సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ఫిలింఛాంబర్ సభ్యులు, మరికొంతమంది హీరోలతో కలిసి సీసీసీ స్థాపించిన చిరంజీవి.. ఇప్పుడా కార్యక్రమాన్ని మరో విడత కొనసాగిస్తున్నారు.

ఇప్పటికే 2 విడతలుగా సీసీసీ ద్వారా సినీకార్మికులకు, పేద కళాకారులకు సాయం అందించారు. అయితే ఇప్పటికీ టాలీవుడ్ కోలుకోలేదు. పూర్తిస్థాయిలో షూటింగ్స్ మొదలుకాలేదు. అందుకే సినీకార్మికులకు సీసీసీ ద్వారా మూడో విడతగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు చిరంజీవి. ఆల్రెడీ ఆ కార్యక్రమం మొదలుపెట్టారు కూడా.

కరోనా సంక్షోభం తాత్కాలికం మాత్రమే అంటున్నారు చిరంజీవి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని, అప్పటివరకు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, కుటుంబాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

Related Stories