ఆచార్యని కలిసిన మోహ‌న్‌బాబు

Chiranjeevi and Mohan Babu

మెగాస్టార్ చిరంజీవిని మోహ‌న్‌బాబు క‌లుసుకున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. బుధ‌వారం మోహ‌న్‌బాబు ‘ఆచార్య’ సెట్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి, చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహ‌పూర్వ‌కంగా క‌లిశారు.

మోహ‌న్‌బాబు ప్ర‌స్తుతం ‘స‌న్ ఆఫ్ ఇండియా’ మూవీ చేస్తున్నారు. మోహన్ బాబు సెట్స్‌కు రావ‌డంతో చిరంజీవి ఆనందంతో మోహ‌న్‌బాబును ఆహ్వానించారు. ఇద్ద‌రూ కొద్దిసేపు సినిమాల‌తో పాటు వివిధ అంశాల‌పై మాట్లాడుకున్నారు.

ఒకప్పుడు చిరంజీవి, మోహన్ బాబు… ఎవరు లెజెండ్, ఎవరు సెలబ్రిటీ అని పబ్లిక్ గా గొడవపడ్డారు. ఐతే గతం గత: అంటూ లేట్ వయసులో ఇద్దరూ కలిసిపోయారు.

More

Related Stories