ఒకే బాటలో చిరంజీవి, ప్రభాస్

- Advertisement -


మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ ఇద్దరూ ఒకే బాటలో పయనిస్తున్నారు. ఒకరు సీనియర్ హీరో. ఇంకొకరు ఆలిండియా స్టార్. కానీ కెరీర్ ప్లానింగ్ లో ఇద్దరిదీ ఒకే శైలి.

మెగాస్టార్ చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంది. మూడు సెట్స్ పై ఉన్నాయి. ఫిబ్రవరిలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ విడుదల కానుంది. ఇక, ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలు సెట్స్ పై నడుస్తున్నాయి. ఈ మూడు షూటింగ్ దశలో ఉండగానే వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా ప్రకటన వచ్చింది.

అంటే, ‘ఆచార్య’ మినహాయిస్తే చిరంజీవి ఇప్పుడు నాలుగు సినిమాలను లైన్ లో ఉంచారు

ప్రభాస్ కూడా అంతే. ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది. ఇది పక్కన పెడితే, ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కే’ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇప్పటికే ‘ఆదిపురుష్’ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకొంది. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల షూటింగ్స్ నడుస్తున్నాయి. ఇవి కాకుండా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’ అనే మరో సినిమాని కూడా ప్రకటించారు ప్రభాస్.

అటు చిరు, ఇటు ప్రభాస్… ఇద్దరూ చెరో నాలుగేసి సినిమాలతో కెరీర్ ని లాక్ చేసుకున్నారు.

 

More

Related Stories