దసరాకి నందమూరి-మెగా వార్

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాక్సాఫీస్ బరిలో పోటీపడి చాన్నాళ్లయింది. ఒకప్పుడు బాక్సాఫీస్ బరిలో బాహాబాహీ తలపడిన ఈ సీనియర్లు, ఇప్పుడు పోటీ లేకుండా తమ సినిమాల విడుదల తేదీల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈసారి పోటీ తప్పేలా లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య-చిరంజీవి సినిమాలు పోటీకి సై అంటున్నాయి.

చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇదే సీజన్ కు బాలకృష్ణ కొత్త సినిమాను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు. చిన్న టీజర్ మాత్రం రిలీజ్ చేశారు.

ఈ రెండు సినిమాలు దసరా బరిలో నిలిస్తే, మరో సినిమాకు చోటు దక్కనట్టే. ఆల్రెడీ దసరా బరిలో నిఖిల్ హీరోగా నటిస్తున్న స్పై సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. బాలయ్య-చిరు బరిలోకి దిగితే స్పై సినిమా పక్కకు వెళ్లినట్టే. 

 

More

Related Stories