- Advertisement -

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. చిరంజీవిని అందరూ మెగాస్టార్ అంటారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో చిరుత అనే నిక్ నేమ్ పెట్టారట.
చిరుత అంటే చిరు(చిరంజీవి) తాత అని అర్థం. ఈ విషయాన్ని ఆయన తనయుడు రామ్ చరణ్ బయటపెట్టారు. చరణ్ తొలి చిత్రం పేరు… చిరుత. ఆ టైటిల్ ఇప్పుడు ఇంట్లో చిరంజీవికి వచ్చింది అన్నమాట.
మెగాస్టార్ ఇంట్లోకి తాజాగా మరో మనవరాలు వచ్చింది. ఈ బుల్లి మనవరాలు ఎవరో కాదు రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లిన్ కార. ఈ చిరుత ఇప్పుడు జూనియర్ మనవరాలుని ఎత్తుకున్న ఫోటోని వెండితెర చిరుత షేర్ చేశాడు. మెగాస్టార్ కి బర్త్ డే విషెష్ చెప్తూ ఈ ఫోటోని, ఈ చిరుత క్యాప్షన్ ని ఇచ్చాడు చరణ్.
ఇటీవలే మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న మెగాస్టార్ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.