ఏడాదిలో మెగా హాస్పిటల్!

మెగాస్టార్ చిరంజీవి సినీకార్మికుల కోసం తన వ్యక్తిగత హోదాలో సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. “మా”, ఫిలిం ఛాంబర్ వంటి వాటితో సంబంధం లేకుండా తన వంతుగా ఆర్టిస్టులకు, కార్మికులకు సాయం అందిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏడాదిలో ఒక ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తానని ప్రకటించారు మెగాస్టార్.

సినిమా వారికోసం ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీలో అన్ని సదుపాయాలతో కూడిన ఒక హాస్పిటల్ ని కట్టిస్తాను అని గతంలోనే చిరంజీవి చెప్పారు. ఇప్పుడు దానికి డెడ్ లైన్ విధించారు. ఏడాదిలో అది పని చెయ్యడం మొదలుపెడుతుందిని తెలిపారు.

“దేవుడు దయ వల్ల ఎంత ఖర్చు అయినా భరించే శక్తి ఉంది. ఈ హాస్పిటల్ ని ఏడాదిలోపు కచ్చితంగా ప్రారంభిస్తాను,” అని మెగాస్టార్ దీక్ష బూనారు. గత కొంతకాలంగా మెగాస్టార్ ఎక్కువగా చారిటీపై దృష్టి నిలిపారు. అభిమానులకు, కార్మికులకు, సినిమా సాంకేతిక నిపుణులు, నటులు, జర్నలిస్టులు, సామాన్య జనం… ఎలా కష్టాల్లో ఉన్నామని ఎవరు ఆయన్ని సంప్రదించినా తన వంతు సాయం అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ సారి తన పుట్టిన రోజు (ఆగస్టు 22)కి తీసుకున్న నిర్ణయం ఏడాదిలో కార్మికుల కోసం ఆసుపత్రి నడిపించడం.

 

More

Related Stories