ఎన్టీఆర్ తో మాట్లాడిన మెగాస్టార్

ఎన్టీఆర్ కి కరోనా సోకింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హైద్రాబాద్ లోని తన ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. దాంతో, ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మెగాస్టార్ చిరంజీవి సాంత్వన పలికే ప్రయత్నం చేశారు. ఐతే, తారక్ చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలిసి సంతోషపడ్డానని చిరంజీవి అంటున్నారు.

“కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు. He and his family members are doing good. తను చాలా ఉత్సాహంగా, energetic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను.
God bless తారక్,” అని మెగాస్టార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి పలువురు పెద్ద స్టార్స్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఎన్టీఆర్ కొంత కాలంగా షూటింగ్ లో కూడా పాల్గొనడం లేదు. అయినా, కరోనా సోకింది.

More

Related Stories