సీటు…కలవరపాటు!

- Advertisement -
Chiranjeevi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నారనే వార్తలు మెగాభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. చిరంజీవి దాన్ని స్వీకరిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయానికి పెద్ద దెబ్బ అవుతుంది. ఇప్పుడు అందరివాడుగా ఉన్న మెగాస్టార్ మరోసారి రాజకీయంగా తప్పటడుగులు వేయొద్దనేది మెగాభిమానుల మాట.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రణాళిక ప్రకారం గాలం వేస్తుంటే చిరంజీవి దానికి చిక్కడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఐతే, చిరంజీవి వర్గం మాత్రం ఇదంతా ఊహాగానమే అని అంటోంది. అలాంటి ప్రొపోజల్ ఏదీ తమకు రాలేదని, మీడియా వార్తలు ఆశ్చర్యపరిచాయని చిరంజీవి టీం చెప్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ ఉంటుంది. అలాగే, మెహెర్ రమేష్ దర్శకత్వంలో మరో మూవీ మొదలవుతుంది.

 

More

Related Stories