బాలయ్య కన్నా ముందే చిరంజీవి రాక

వచ్చే సంక్రాంతి పండుగ … 20 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను గుర్తు చేస్తోంది. అప్పట్లో చిరంజీవి, బాలయ్య సినిమాలు సంక్రాంతికి పోటాపోటీగా విడుదల అయ్యేవి. అప్పట్లో వారిద్దరూ అగ్ర హీరోలు. కాలం మారింది… ఇప్పుడు వాళ్ళు సీనియర్స్. జయాపజయాలకు సంబంధంలేని స్టార్డం వారిది. అయినా… పోటీ పడుతున్నారు.

‘ఆదిపురుష్’ సినిమా కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో అందరి చూపులు ఈ రెండు తెలుగు స్ట్రయిట్ చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండింటితో పాటు విజయ్ నటిస్తున్న అనువాద చిత్రం ‘వారసుడు’ కూడా బరిలో ఉంది అనుకొండి. ఐతే, చిరంజీవి, బాలయ్య మధ్య ఫైట్ అంటే ఉండే ఆసక్తి వేరు కదా. అందుకే, ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహ రెడ్డి’ చిత్రాల గురించే అందరి డిస్కషన్.

సంక్రాంతి పండుగ సీజన్లో ఈ రెండింటిలో ఏ సినిమా ముందు, ఏ సినిమా తర్వాత వస్తుంది? ఇదే విషయంలో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కిందా మీదా అవుతోంది.

ప్రస్తుతానికి వాల్తేర్ వీరయ్య ముందు వచ్చేలా ఉంది. త్వరలోనే ఈ రెండు సినిమాల డేట్స్ ని ప్రకటిస్తారు.

 

More

Related Stories