
మెగాస్టార్ చిరంజీవి కూడా అగ్ర నిర్మాత దిల్ రాజుని అనుకరించారు. “భోళా శంకర్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి కొన్ని వీడియో ఇంటర్వ్యూలు చేశారు. అందులో ఆయన దిల్ రాజు స్టయిల్ లో మాట్లాడడం విశేషం.
ఆ మధ్య దిల్ రాజు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో “వారిసు” అనే చిత్రం నిర్మించారు. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు తమిళ్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. డ్యాన్స్ కావాలా డ్యాన్స్ ఉంది, ఫైట్లు కావాలా ఫైట్లు ఉన్నాయి. కామెడీ కావాలా కామెడీ ఉంది… అన్ని “ఇరుక్కు” (ఉన్నాయి) అన్నారు. దిల్ రాజు వచ్చిరాని తమిళ్ లో మాట్లాడడం బాగా వైరల్ అయింది.
ఇప్పుడు చిరంజీవి కూడా అదే స్టయిల్ లో “భోళా శంకర్” సినిమాలో డ్యాన్స్ వెనుమా డ్యాన్స్ ఇరుక్కు, కామెడీ వేనుమా కామెడీ ఇరుక్కు అంటూ మాట్లాడారు.
మొత్తానికి చిరంజీవి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. అందరినీ అనుకరిస్తున్నారు. ఈ సినిమాలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని కూడా అనుకరించారు.