బ్రహ్మాస్త్రలోకి మెగాస్టార్ ఎంట్రీ

బాలీవుడ్ లో తెరకెక్కిన బ్రహ్మాస్త్రకు సౌత్ కనెక్షన్ కూడా ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించాడు. ఇక సినిమా సౌత్ ప్రమోషన్ కోసం రాజమౌళిని రంగంలోకి దించారు. ఇప్పుడీ సినిమాకు తెలుగులో మరింత ఊపు తెచ్చేందుకు ఏకంగా మెగాస్టార్ ను రంగంలోకి దించారు. అవును.. బ్రహ్మాస్త్రలో ఇప్పుడు చిరంజీవి కూడా ఓ భాగమయ్యారు.

ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఓ అడుగు ముందుకేశారు. బ్రహ్మస్త్ర సినిమాకి వాయిస్ ఓవర్ అందించారు. “ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతనే శివ” అని మెగాస్టార్ వాయిస్ తో స్టార్ట్ అయ్యే ట్రైలర్ జూన్ 15న విడుదలకానుంది.

ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 3 భాగాలుగా రాబోతుంది. ఇందులో మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్-1ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సౌత్ భాషల్లో రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నాడు.

 

More

Related Stories